రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన RRR మూవీ విడుదలకు ముందే మరో రికార్డు సృష్టించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ సేల్స్ వన్ మిలియన్ డాలర్లను దాటేసింది. ఈ మూవీ విడుదల నాటికి దాదాపు 5 మిలియన్ డాలర్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద RRR భారతదేశంలోనే కాకుండా ఓవర్సీస్లో కూడా రికార్డులను బద్దలు కొడుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.