RRR మూవీ థియేటర్లలో రచ్చ చేస్తుంది. బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా న్లజర్లలో శ్రీలక్ష్మి కాంప్లెక్స్ థియేటర్ లో ఆర్ఆర్ఆర్ చూస్తూ మహిళా ప్రేక్షకులు సందడి చేశారు. ఎత్తరజెండా సాంగ్ వస్తున్న సమయంలో స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్స్‌లు వేశారు. ఈలలు వేస్తూ గోల చేస్తూ సినిమాను ఎంజాయ్ చేశారు. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ మహిళలను కూడా ఎంతగా మెప్పించిందో ఈ విషయం చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.