RRR మూవీ టిక్కెట్ ధరలను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. GO ప్రకారం రూ.100 కోట్ల రూపాయల బడ్జెట్ (నటీనటులు, సిబ్బంది రెమ్యూనరేషన్లు మినహా) సినిమాలకు టిక్కెట్ ధరలను పెంచడానికి ఓకే చెప్పింది. ఆర్ఆర్ఆర్ చిత్రం తొలి 10 రోజులు టిక్కెట్ ధరలను మరో రూ.75 పెంచినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. మే నాటికి ఆన్లైన్ సినిమా టికెటింగ్ విధానాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి తెలిపారు.