RRR ఇప్పుడు హాట్‌స్టార్‌లో..

ఈ ఏడాది ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ RRR ఓటీటీల్లో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్ప‌టికీ ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌, జీ5లో స్ట్రీమ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా హాట్‌స్టార్‌లో కూడా ఆర్ఆర్ఆర్ స్ట్రీమ్ అవుతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. హాట్‌స్టార్‌లో తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో ఇది అందుబాటులో ఉంది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్‌చ‌రణ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇప్ప‌టికీ రాజ‌మౌళి, తార‌క్, చ‌ర‌ణ్ ప్ర‌తిభ‌ను ప్ర‌శంసిస్తూ హాలీవుడ్ న‌టులు, ద‌ర్శ‌కులు ట్వీట్స్ చేస్తున్నారు.

Exit mobile version