సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నRRR ఓటీటీ రిలీజ్ తేదీ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ జీ5లో మే 20 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందని చిత్రబృందం ప్రకటించింది. మార్చిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లబించింది.