పాన్ ఇండియా మూవీ RRR మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. కరోనా థర్డ్ వేవ్ కంటే ముందు ఈ సినిమాకు భారీగా ప్రమోషన్స్ చేశారు. అప్పుడే విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఇక, ఇప్పటి వరకు రాధే శ్యామ్ సినిమాకి ఎలాంటి ఆటంకం కలిగించకూడదని భావించిన దర్శకుడు రాజమౌళి రెగ్యులర్ ప్రమోషన్స్ చేయలేదు. తాజాగా, ఈ సినిమా విడుదల కావడంతో RRR ప్రమోషన్ డోస్ పెంచబోతన్నారట. చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య మరోసారి ప్రమోషన్స్‌పై భారీగానే ఖర్చు పెట్టబోతున్నారు. ఈ మేరకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 18న రాత్రి 7 గంటలకు దుబాయ్‌లో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో జరగనుంది.