• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూఎస్‌లో $1.5 మిలియన్ మార్కును దాటిన RRR ప్రీరిలీజ్ సేల్స్

    ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం RRR. భారీ తారాగణంతో రూ.550 కోట్లతో నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుండగా, దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. అమెరికాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ సేల్స్ 1.5 మిలియన్ డాలర్ల మార్కును దాటిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా విడుదలకు ఇంకా పది రోజుల సమయం ఉండగా.. అప్పటి వరకు సుమారు $3-$5 మిలియన్ కలెక్షన్లు ప్రీమియర్స్‌కే వస్తాయని తెలుస్తోంది. ఈ మొత్తంలో ప్రీమియర్ కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి అని పేర్కొంటున్నారు.