కొత్తగా ఏ సినిమా రిలీజైనా..ఏ సినిమా సక్సెస్ సాధించినా అది కాపీ కథ, కాపీ ట్యూన్స్ అంటూ ముద్ర వేసేందుకు కొంతమంది సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు భారీ కలెక్షన్లతో పాటు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’కు కూడా అది తప్పలేదు. సినిమాలో రామ్‌చరణ్‌ను పరిచయం చేసే సీన్ వరల్డ్ మోస్ట్ ఫేమస్ వెబ్‌సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నుంచి కాపీ కొట్టారని ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి సీన్లు కాపీ కొట్టి పాన్ ఇండియా సినిమాగా చెప్పుకుంటున్నారంటూ విమర్శిస్తున్నారు. అయితే రాజమౌళి ఫ్యాన్స్ వారికి ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఇండియా గర్వపడేలా ఒక పెద్ద సినిమా తీస్తే గర్వించాల్సింది పోయి, అనవసరంగా కామెంట్స్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.