RRR టీమ్ వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. నిన్న కర్ణాటకలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర బృందం నేడు బరోడాకు బయల్దేరి వెళ్లింది. మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ వద్ద రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి దిగిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వరుసగా పలు నగరాల్లో ప్రమోషన్స్ చేపట్టనున్న ఈ బృందం మార్చి 23న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది.