మార్చి 25న RRR సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది . ఈ వారం రోజుల్లో చిత్రబృందం దేశం మొత్తం చుట్టేసి ప్రమోషన్స్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ టూర్ వీడియోను తాజాగా విడుదల చేశారు. రేపు హైదరాబాద్ నుంచి దుబాయ్లో వెళ్లనున్న టీమ్, తిరిగి వచ్చి మార్చి 19న బెంగుళూరుకు వెళ్తారు. ఆ తర్వాత దిల్లీ, కోల్కత్తా, జైపూర్ ఇలా దేశంలోని అన్ని ప్రముఖ రాష్ట్రాల్లో పర్యటించి చివరికి మార్చి 23న హైదరాబాద్లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ ఏరోజు ఎక్కడికి వెళ్తుందో మీరూ ఈ వీడియోలో చూసేయండి.