తమ అభిమాన హీరోల సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. థియేటర్లలో తెరపైకి పేపర్లు, పూలు విసురుతూ, డ్యాన్సులు చేస్తుంటారు. ఇటీవల ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రిలీజైనప్పుడు ఫ్యాన్స్ తెరపైన ఏకంగా పాలాభిషేకం చేశారు. దాంతో స్క్రీన్ పాడైపోవడంతో థియేటర్ యాజమానులకు నష్టం కలిగింది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. అందుకే ముందు జాగ్రత్తగా తెరవద్దకు వచ్చి ఏమి హడావిడి చేయకుండా వారిని నియంత్రించేందుకు స్క్రీన్ ముందు మేకులను ఏర్పాటుచేశారు. ఏపీలోని విజయవాడ అన్నపూర్ణ థియేటర్ యాజమాన్యం ఈ రకంగా ముందస్తు జాగ్రత్తలను చేపట్టింది.