RRR కలెక్షన్ల వేట మొదలైంది. బాక్సాఫీస్ బద్దలు కొడుతూ మొదటిరోజే రూ.223 కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు ఉన్న బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. మూడో రోజు ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.33 కోట్లు వసూలు చేసింది. ఇక విదేశాల్లో కూడా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటివరకు 9 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. బాలీవుడ్లోనూ సినిమా సత్తా చాటుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు దర్శకుడిని, నటీనటులను ప్రశంసిస్తూ సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు.