జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా RRR. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ సినిమా ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఒక్క యూకేలోనే 1000 స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ అయిన ఓడియన్ బీఫ్ ఐ ఐమ్యాక్స్పై RRR సినిమా ఆవిష్కృతం కావడం విశేషం. కాగా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో RRR టీం, ప్రమోషన్స్ మొదలుపెట్టనుంది.