ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం మొదలైంది. అమెరికాలో మార్చి 24 నుంచి ప్రీమియర్స్ ప్రారంభం కాగా 3 మిలియన్ డాలర్లు అంటే రూ.22 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అక్కడ రాత్రి 9 గంటలలోపే 985 ప్రాంతాల్లో 3,019,897 డాలర్లు వసూలు చేసినట్లు సమాచారం. మరో 200 ప్రాంతాల నుంచి సమాచారం రావాల్సి ఉంది. మొత్తానికి కేవలం ప్రీమియర్స్ బిజినెస్ సులభంగా 3.5 మిలియన్ డాలర్లను టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.