హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం 189 కి.మీ పొడవుతో నిర్మితం కానుంది.ఈ మేరకు ఎన్హెచ్ఏఐ అలైన్మెంట్ ఖరారు చేసింది. దీనికి ఈ వారంలోనే అధికారిక ఆమోదం లభించనుంది. సంగారెడ్డి నుంచి కంది, నవాబ్‌పేట్, చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, ఆమన్‌గల్, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్ వరకు ఈ ఆర్ఆర్ఆర్ నిర్మించనున్నారు. దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ను కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పరియోజన పథకం-2 కింద ఎంపిక చేసింది.