ఫిజ్జా ఆర్డర్ క్యాన్సిల్ చేసినందుకు రూ.10 వేలు ఫైన్

Courtesy Twitter:

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు వినియోగదారుల కమిషన్ రూ.10 వేలు జరిమానా విధించింది. వివరాల్లోకెళ్తే.. చండీఘడ్‌కు చెందిన అజయ్ కుమార్ అనే వ్యక్తి జొమాటో నుంచి రూ.287 విలువైన ఫిజ్జాను ఆర్డర్ చేశాడు. అయితే కొద్ది సేపటికి ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యిందని, డబ్బులు రిఫండ్ చేస్తామని జొమాటో నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా అజయ్ చండీఘడ్‌లోని స్థానిక కోర్టును ఆశ్రయించాడు. అక్కడ ఫలితం లేకపోవడంతో చండీఘడ్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేసిన కమిషన్ జొమాటోకు రూ.10వేలు జరిమానా విధించడంతో పాటు అజయ్‌కు ఫ్రీ మీల్ ఇవ్వాలని ఆదేశించింది.

Exit mobile version