విశాఖపట్నం గాజువాకలో మద్యం సేవించి వాహనం నడపడంతో పాటు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి కోర్టు రూ.10వేల జరిమానా విధించింది. అతడితో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 25 మందికి కోర్టు గట్టిగానే బుద్ధిచెప్పింది. 15 మంది నిందితులకు రూ.1500 చొప్పున, మరో 9 మందికి రూ.2 వేల చొప్పున ఫైన్లు వేసింది. దీంతో పాటు అందరూ ఒక్కో గంట కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్లకార్డులతో అవగాహన కల్పించాలని నిర్దేశించింది.