తెలంగాణలో తొలి మహిళా విశ్వవిద్యాలయం కోసం రూ.100 కోట్లు

© File Photo

మహిళలు ఉన్నత విద్యలో అగ్రగామిగా నిలిచేందుకు తెలంగాణలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అందుకు సహకరించిన సీఎం చంద్రశేఖరరావుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఈ ఆర్థిక సంవత్సరంలో సంబంధిత పనుల కోసం రూ.100 కోట్లు కేటాయించారు. కోటి మహిళా కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా మార్చాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్‌ను కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆమె ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కేసీఆర్ తన కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు.

Exit mobile version