స్టాక్ మార్కెట్లలో తెలివిగా పెట్టుబడులు పెడితే ఒక్కసారిగా దశ తిరుగుతుంది. అలాంటిదే ఇప్పుడు జరిగింది. హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న AMTD డిజిటల్‌లో షేర్లు పెట్టిన వారికి కాసుల వర్షం కురిసింది. AMTD జులై 15న న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైంది. దీని ఐపీఓలో షేర్లు దక్కించుకుని తెలివిగా విక్రయించిన వారికి దాదాపు 32,660 శాతం రాబడి వచ్చింది. అంటే దాదాపు రూ.619 వద్ద ఐపీఓలో షేరు కొనుక్కొని ఆగస్టు 2న బయటకొచ్చిన వారికి ఒక్కో షేరుపై రూ.2,02,395 లాభం వచ్చింది. ఇప్పటికీ అలాగే ఉన్న వారి షేరు ధర రూ.87,378.50గా ఉంది.