డిజిటల్ లావాదేవీల వినియోగం పెరిగిందని పలువురు సంతోష పడుతుండగా, కరెన్సీ నోట్ల కొరత ఏర్పడుతుందని మరికొందరు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ల(ATM)లో ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రూ.2,000 డినామినేషన్స్ పెట్టడం లేదు. దీంతో ఎక్కువ మొత్తంలో నగదు విత్ డ్రా చేయాలంటే ఇబ్బందులు పడుతున్నట్లు కొంతమంది బాధితులు చెబుతున్నారు. పలు ఏటీఎం కేంద్రాల్లో ఒకే సారి విత్ డ్రా చేస్తే రూ.10 వేలకు మించి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 100, 200, 500 రూపాయల నోట్లు మాత్రమే ఏటీఎంలలో ఉంటున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో లక్ష రూపాయల నగదు డ్రా చేయాలంటే చాలా సమయం అవుతుందని అంటున్నారు.