తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధం అవుతోంది. ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు అందిస్తామని గతంలో TRS ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశగా నాలుగు విడతల్లో నగదు సాయం అందించనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎంత మంది ఉంటారనే దానిపై ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో అంతకంటే ముందుగానే ఈ స్కీమ్ అమలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.