డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు బుధవారం ఢిల్లీ ఎయిర్ కార్గో కాంప్లెక్స్ వద్ద ఒక ఎయిర్ కార్గో సరుకును అడ్డగించారు. అందులో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారనే అనుమానంతో ‘గోల్డెన్ ట్యాప్’ పేరుతో రహస్య ఇంటెలిజెన్స్ ఆపరేషన్ కోడ్ నిర్వహించారు. ట్రయాంగిల్ వాల్వ్‌లలో దాచిన రూ. 32.5 కోట్ల విలువైన 61.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు చైనాలోని గ్వాంగ్‌జౌ నుంచి ఉత్పత్తి జరిగినట్లు గుర్తించారు. జపాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో డిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి చేరుకుంది.