గుజరాత్లో ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. రూ.480 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలను ఏటీఎస్ అధికారులు పట్టుకున్నారు. వడోదర జిల్లాలోని సింధ్రోత్లో ఉన్న ఓ చిన్న పరిశ్రమలో మెఫిడ్రోన్ ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.మొత్తం 143 కిలోల డ్రగ్స్ పట్టుకున్నారు. దీని విలువ రూ.480 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సౌమిల్ పాటిల్, మహ్మద్ షఫీ, వినోద్, శైలేష్, భరత్ లను అదుపులోకి తీసుకున్నారు.