‘రూ. 100తో రూ.50 లక్షలు గెలిచాడు’

© Envato

అదృష్టం వరిస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారంటారు. పంజాబ్‌కు చెందిన టార్సెమ్‌ లాల్‌ జీవితంలో అచ్చం అలాగే జరిగింది. స్వీపర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే లాల్‌ రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. రూ.100 రూపాయలతో ఏకంగా రూ.50లక్షలు గెలిచాడు. 25 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్న లాల్‌కు ఈసారి అదృష్టం వరించింది. రూ.50 లక్షలు గెలుచుకోవడంపట్ల టార్సమ్ సంతోషం వ్యక్తం చేశాడు.వాటితో తన కూతురు పెళ్లి చేయడంతో పాటు తన వృద్ధాప్య ఖర్చులకు దాచుకుంటానని చెప్పాడు.

Exit mobile version