వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక్కో టీచర్‌కు రూ.5 వేలు లంచం ఇస్తున్నట్లు టీడీపీ అదినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయుల ఓట్లను కొనేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైందని ఆయన విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓటేస్తే మీ జీవితాలకు మీరే ఉరి తాడు బిగించుకున్నట్లేనని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలో విద్యావ్యవస్థ పతనమైందని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన కోరారు.