ముచ్చింతల్ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించేందుకు ఆర్‌టీసీ బస్సులను ఏర్పాటు చేసింది టీఎస్ఆర్‌టీసి. అఫ్జల్‌గంజ్ నుంచి ఉదయం 7.20 గంటలకు బస్సులు ప్రారంభమవుతాయి. రాత్రి 8 గంటలకు చివరి బస్ ముచ్చింతల్ నుంచి అఫ్జల్‌గంజ్ వరకు ఉంటుంది. ఈ సదుపాయాన్ని వినియోగించుకొని ప్రజా రవాణాలో సురక్షితంగా వెళ్లి దర్శించుకోవాలని తెలిపింది.