సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మధ్య 4,233 ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. అందులో 585 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఉంచామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. గతేడాదితో పోలీస్తే 10 శాతం పెంచినట్లు తెలిపారు. జనవరి 7వ తేదీ నుంచి 15 వరకు బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా బస్సులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.