1990లో వచ్చిన ఆషికి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న నటి ‘అను అగర్వాల్’. కానీ, రోడ్డు ప్రమాదంతో ఈ నటి కోమాలోకి వెళ్లడం అప్పట్లో కలకలం రేపింది. అయితే, ఓ వ్యక్తితో సహజీవనం చేయడం వల్ల తన జీవితం తలకిందులైందని ఇటీవల బోరుమంది. ‘మాతో పాటు ఆ వ్యక్తి వాళ్ల అమ్మ కూడా కలిసే ఉండేది. ఆవిడ మమ్మల్ని అంగీకరించారు కూడా. కానీ, తన స్నేహితులు ఆమెకు నా గురించి చెడుగా చెప్పారు. తప్పుడు వార్తలొచ్చాయి. దీంతో వాటిని నమ్మి నన్ను దూరం పెట్టారు. ఆ క్షణంలో నా బాధ వర్ణానాతీతం’ అంటూ 54ఏళ్ల ఈ మోడల్ ఆనాటి క్షణాలను గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ఫౌండేషన్‌ని నడుపుతోంది.