విశాఖపట్నం నుంచే పరిపాలన కొనసాగిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పాలన ప్రారంభిస్తామని చెప్పారు. చంద్రబాబు, పవన కల్యాణ్ ఒకటేనని ఎప్పటినుంచో చెబుతున్నామని, అది ఇప్పుడు బయటపడిందని పేర్కొన్నారు. దీంతో జనసేన, టీడీపీ ముసుగు తొలగిపోయిందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా 2024లో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని సజ్జల పేర్కొన్నారు.