తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ లో రమ్మీ ఆడేవారిపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీపై నిషేధం ఉన్న నేపథ్యంలో కొందరు నకిలీ GPS ఆధారంగా రమ్మీ ఆడుతున్నారని చెప్పారు. వారిపై నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ జీపీఎస్ సాయంతో వెరే రాష్ట్రంలో ఉన్నట్లు చూపుతూ రమ్మీ ఆడుతున్నట్లు వివరించారు.