‘బిచ్చగాడు’ సినిమా హీరో విజయ్ ఆంటోనీ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లని ఆయన సన్నిహిత వర్గాలు ఖండించాయి. ‘బిచ్చగాడు2’ సినిమా షూటింగులో విజయ్‌కి తీవ్ర గాయాలేం కాలేదని తెలిపాయి. నడుముకు కాస్త గాయమైందని, ప్రస్తుతం విజయ్ తన సినిమా పనులు చేసుకుంటున్నారని వెల్లడించాయి. నటుడు చెన్నైకి చేరుకున్నట్లు స్పష్టం చేశాయి. ‘విజయ్‌కి పెద్ద ప్రమాదమేం జరగలేదు. తీవ్ర గాయాలైనవన్నది పుకారే. ఆయన తన పని చేసుకుంటున్నారు. షూటింగ్ వాయిదా పడింది’ అని స్పష్టం చేశాయి. కాగా, మలేషియాలో స్కైబోట్ డైవ్ చేస్తూ విజయ్ ప్రమాదానికి గురయ్యారు.