రూపాయి విలువ పతనం కావట్లేదని.. డాలర్ విలువ పెరగడమే ఇందుకు కారణమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంతర్జాతీయ క్రయ, విక్రయాలు డాలర్‌తోనే ముడిపడినందున దేశీయ కరెన్సీలు పడిపోతున్నాయని ఆమె తెలిపారు. రూపాయి స్థిరత్వం కోల్పోకుండా ఆర్బీఐ దృష్టిపెట్టిందని నిర్మల స్పష్టం చేశారు. ‘డాలర్ విలువ పెరుగుతున్నందున.. రూపాయి విలువ తగ్గినట్లు కనిపిస్తోంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి మెరుగ్గానే ఉంది. అయితే, రూపాయి అస్థిరతను తగ్గించేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. ఇలా చేస్తే రూపాయి పుంజుకోవడం ఖాయం’ అని ఆర్థికమంత్రి చెప్పారు.