మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని కీసర మండలం గోధుమకుంట గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేరిన వారికి రూ. 5 వేలను అందించనున్నట్లు ఉప సర్పంచితో కలిసి నిర్ణయించారు. పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోంది. రూ. 5 వేలు మాత్రమే కాకుండా ప్రతి విద్యార్థికి రెండు జతల బట్టలు, బూట్లు, సాక్సులు, బస్ పాస్ అందించనున్నట్లు తెలిపారు. ఈ వివరాలతో కూడిన ఫ్లెక్సీని పాఠశాల మెయిన్ గేట్ వద్ద ఏర్పాటు చేశారు.