నేడు ఆరెంజ్ ఆర్మీతో మ్యాచులో కేకేఆర్ టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకుంది. సన్ బౌలర్ల దెబ్బకు ఆ జట్టు 100 పరుగుల్లోపే 5 ప్రధాన వికెట్లను కోల్పోయింది. కానీ ప్రస్తుతం అరవీర భయంకరుడు అండ్రీ రస్సెల్ (9*), బిల్లింగ్స్ (14*) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. మరి కేకేఆర్ ఇన్నింగ్స్ ను రస్సెల్ సునామీ కాపాడుతుందో చూడాలి. ప్రస్తుతం కేకేఆర్ 15 ఓవర్లలో 119 పరుగులు చేసింది.