ఉక్రెయిన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా రష్యా దూకుడు పెంచింది. దీంతో రష్యా-పోలండ్ సరిహద్దులో ఉన్న సైనిక స్థావరంపై 30 క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో దాదాపు 30 మంది మరణించగా, 134 మంది క్షతగాత్రులయ్యారు. నాటో కూటమి దేశమైన పోలండ్ సరిహద్దు వరకు రష్యా సేనలు చేరడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారేలా ఉంది. రష్యా బలగాలు పోలండ్పై దాడి చేస్తే నాటో సైన్యం రంగంలోకి దిగే అవకాశం ఉంది.