ఉక్రెయిన్- రష్యా యుద్ధం ఆంక్షలకు అడ్డాగా మారింది. ఇదివరకు పశ్చిమ దేశాలు రష్యాపై వర్తక, వాణిజ్య ఇతర ఆంక్షలు విధించగా.. ఇప్పుడు రష్యా కూడ రివర్స్‌గా అలాంటి నిషేధాలే విధిస్తుంది. అమెరికాకు చెందిన ఫేస్బుక్, ట్విట్టర్, యాప్ స్టోర్లపై నిషేధం విధించింది. అలాగే బ్రిటన్‌కి చెందిన బీబీసీపై కూడ ఆంక్షలకు పూనుకుంది. రష్యాకి వ్యతిరేకంగా వస్తున్న వార్తలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.