ఉక్రెయిన్లోని ఖేర్సన్ అనే నగరాన్ని రష్యా తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. అలాగే ఖేర్సన్ ప్రధాన ఓడరేవును కూడ హస్తగతం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 6000 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ చేసిన ప్రకటనను ఖండించింది. తమ సైన్యంలో 500 మంది చనిపోయారని, 1600 మంది గాయపడ్డారని వెల్లడించింది. అలాగే ఖర్కివ్, మరియుపొల్ నగరాలపై కూడ పట్టుసాధించేందుకు మాస్కో దళం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఒకవైపు యుద్ధం కొనసాగుతూనే ఉండగా..బెలారస్లో రెండో దశ చర్చలు ప్రారంభమయ్యాయి.