రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ రెండు రోజుల పర్యటన కోసం ఇండియాకు రానున్నారు. ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించిన తర్వాత సెర్జీ చేస్తున్న పర్యటన కావడం వల్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సెర్జీ ఇండియాలో రెండు రోజుల పాటు పర్యటిస్తారని విదేశాంగ శాఖ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే చాలా దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇండియా సహకారం రష్యాకు చాలా అవసరం ఉంది. దీనికి సంబంధించి సెర్జీ చర్చలు జరిపే అవకాశం ఉంది.