‘మరియోపోల్‌పై రష్యా రసాయనిక దాడులు చేయొచ్చు’

ఉక్రెయిన్-రష్యా యుద్ధం చాలా భీకరంగా కొనసాగుతోంది. ఈ యుద్ధం మొదలై దాదాపు రెండు నెలలు కావస్తున్నా కానీ.. పెద్ద దేశంగా పేరున్న రష్యా ఇప్పటికీ ఉక్రెయిన్ మీద పట్టు సాధించలేకపోయింది. దీంతో ఉక్రెయిన్ పోర్ట్ సిటీ అయిన మరియోపోల్‌పై రష్యా రసాయనిక దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు US హెచ్చరించింది. ఇదే కనుక జరిగితే చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మాస్కో ఆక్రమిత క్రిమియాను రష్యా మద్దతు గల వేర్పాటువాద భూభాగాలైన డొనెట్స్క్, డాన్‌బాస్‌లోని లుగాన్స్క్‌తో అనుసంధానించేందుకు రష్యా దళాలు ప్రయత్నిస్తున్నాయని US పేర్కొంది.

Exit mobile version