ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడులను రష్యా తీవ్రతరం చేసింది. ఆ దేశ సైనికులు ఏమాత్రం జంకకుండా పోరాడుతుండడంతో మాస్కో సేనలు ఫిరంగులతో దాడులకు దిగుతున్నారు. ఇందులో భాగంగా జరిపిన దాడిలో 600 మంది ఉక్రెయిన్ సైనికులు, పౌరులు మృతి చెందినట్లు రష్యా తెలిపింది. మరియుపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్‌ప్లాంట్ స్వాధీనానికి పుతిన్ సేనలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంతో ఆ ప్లాంట్‌లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు సహాయం చేయాలని ఐక్యరాజ్యసమితి డైరెక్టర్ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశాడు.