ఉక్రెయిన్ పై రష్యా యుద్దం ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. దీంతో పాటు పలు దేశాలు రష్యాను క్రీడా ప్రపంచం నుంచి వెలివేస్తున్నాయి. UEFAతో పాటు ఫుట్బాల్ గవర్నింగ్ కౌన్సిల్ FIFA త్వరలో జరగబోయే ప్రపంచ కప్ తో అన్ని పోటీల నుంచి తప్పించింది. ఇంటర్నేషనల్ ఐస్ హాకీ ఫెడరేషన్ సైతం రష్యా తోపాటు ఆ దేశానికి మద్దతునిస్తున్న బెలారస్ పై నిషేధం విధించింది. ఇక, అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ అన్ని దేశాల క్రీడా సమాఖ్యలకు రష్యాను సస్పెండ్ చేయాలని సూచించింది.