ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ధ్వంసమైంది. ఈ మేరకు ఉక్రెయిన్ డిఫెన్స్ వెల్లడించింది. రష్యా చేసిన దాడిలో ఫ్లాగ్ మ్యాన్ ఎయిర్ కాఫ్ట్ An-225 మ్రియా(కల) ధ్వంసమైందని, కీవ్ సమీపంలోని హోస్టమేల్ విమానాశ్రయంపై చేసిన దాడులు ఈ అతిపెద్ద విమానం ధ్వంసమైనట్లు ప్రకటించింది. దీంతో పాటు రష్యా దళాలు చేస్తున్న దాడిలో 352మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయారని ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 116 చిన్నారులు ఉన్నారని, వీరితో పాటు 1,684 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది.
AP News
సొంత పార్టీ నేతలపై కోటం రెడ్డి తీవ్ర విమర్శలు