ఉక్రెయిన్-రష్యా మధ్య నాలుగో రౌండ్ చర్చలు ప్రారంభమయ్యాయి. వర్చువల్ విధానంలో భేటీ కొనసాగుతుంది. ఈ భేటీ గురించి ఉక్రేనియన్ ప్రతినిధి మైఖైలో పోడోల్యాక్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రధానంగా ఈ చర్చల్లో శాంతి, కాల్పుల విరమణ, దళాల తక్షణ ఉపసంహరణ, భద్రతా హామీలపై చర్చించనున్నట్లు తెలిపారు. రష్యా దాడులు మరింత పెంచిన క్రమంలో ఇరు దేశాల మధ్య మళ్లీ చర్చలు కొనసాగుతుండటం విశేషం. మరి ఈ రౌండ్ చర్చలైనా సఫలం అవుతాయో లేదో చూడాలి.