ఉక్రెయిన్‌పై దాడి కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని సౌదీ చక్రవర్తి మహమ్మద్ బిన్ సల్మాన్ ఫోన్ ద్వారా సంప్రదించినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకటించింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలతో మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సల్మాన్ వెల్లడించారట. యుద్ధం కొనసాగితే ఆర్థిక, రాజకీయ సుస్థిరత దెబ్బతినే అవకాశం ఉందన్నట్లు సమాచారం. రష్యా, సౌదీ దేశాలు ఓపెక్లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. దీంతో ఈ యుద్ధం ప్రభావం పెట్రోల్ ఎగుమతి, దిగుమతులపై పడుతుంది. అందుకే సౌదీ, ఇతర గల్ఫ్ దేశాలు ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు దారులు వెతుకుతున్నాయి.