రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలని యావత్ ప్రపంచం ఆశించిన తరుణంలో ఇరు దేశాల ప్రతినిధులు శాంతి చర్చలు జరిపారు. కాని ఇరు దేశాల డిమాండ్లకు పరస్పర అంగీకారం లభించకపోవడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై దాడికి రష్యా కొంత విరామం ఇచ్చింది. అలాగే తమను ఈయూలో చేర్చుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దరఖాస్తు చేసుకున్నాడు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఇంకా స్పష్టత రాలేదు. గత 24 గంటల నుంచి అంత స్తబ్ధుగా మారింది.