ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్ ముందుకొచ్చినట్లు తెలుస్తుంది. ప్రపంచదేశాలన్నీ రష్యా దాడిని వ్యతిరేకించినప్పటికీ పుతిన్‌తో ఈ అంశంపై చర్చించడానికి ముందుకు మాత్రం రాలేదు. కాని ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో 3 గంటల పాటు చర్చలు జరిపారు. తదనాంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడ యుద్ధ వాతావరణంపై చర్చించారు. ఇరు దేశాలు శాంతి ఒప్పందాలు చేసుకునేలా అడుగులు వేస్తున్నారు. ఈ యుద్ధం తర్వాత రష్యా అధ్యక్షుడిని కలిసిన తొలి ప్రధాని బెన్నెట్ కావడం గమనార్హం.