ఉక్రెయిన్పై పట్టు సాధించడమే లక్ష్యంగా దాడులు జరుపుతున్న రష్యాపై ప్రపంచ దేశాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా ఉక్రెయిన్లో యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) విచారణ ప్రారంభించింది. ఈ యుద్ధంపై దర్యాప్తు చేయాలనే విషయాన్ని కోర్టులో తెలిపానని ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీంఖాన్ తెలిపారు. రష్యా సైనిక చర్యకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఈ ఘర్షణలో వేలాదిమంది మరణించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.