ఉక్రెయిన్ దేశం యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో రష్యా మరింత భయంకర దాడులు చేసే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. ఇప్పటికే రష్యా దాడులు ప్రారంభించి మూడు నెలలకు పైనే అవుతుంది. రష్యా భీకర దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. పారిశ్రామిక డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు.