ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కీవ్ సమీపంలోని ఇర్పిన్ పట్టణంలో అమెరికాకు చెందిన జర్నలిస్టుల కారును అడ్డుకొని కాల్పులు జరిపారు. ఈ దాడిలో న్యూయార్స్ టైమ్స్కి చెందిన వీడియో జర్నలిస్టు బ్రెంట్ రేనాడ్ మృతి చెందగా, జువాన్ అరెడొండో అనే మరో పాత్రికేయుడు గాయాలపాలయ్యారు. కీవ్ పట్టణంలో పరిస్థితిని రిపోర్టు చేస్తుండగా రష్యా సైన్యం ఈ కాల్పులు జరిపిందని జువాన్ వివరించాడు.