• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెరికా డ్రోన్‌ను ఢీకొట్టిన రష్యా ఫైటర్ జెట్స్

    ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికా-రష్యాల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. నల్లసముద్రంపై ఎగురుతున్న అమెరికా ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ను రష్యా యుద్ధ విమానం ఢీకొట్టింది. డ్రోన్‌ ప్రొపెల్లర్‌ ధ్వంసం కావడంతో దాన్ని సముద్రంలో కూల్చేయాల్సి వచ్చిందని అమెరికా ప్రకటించింది. ‘అంతర్జాతీయ జలాల్లో విధులు నిర్వర్తిస్తున్న మా డ్రోన్‌ను రష్యాకు చెందిన రెండు సుఖోయ్‌-27 యుద్ధ విమానాలు అడ్డుకున్నాయి. ఓ యుద్ధవిమానం మా డ్రోన్‌ ప్రొపెల్లర్‌ను ఢీకొట్టింది. మా డ్రోన్‌పై పలుమార్లు ఇంధనాన్ని కుమ్మరించాయి’ అని అమెరికా తెలిపింది.